విధిరాత నియమాలు-6

విధిరాత నియమాలు-6

2024-04-27T00:52:02

సకల సృష్టికి మూలాధారం అల్లాహ్‌యే. ఆయన తన యుక్తినీ, ప్రణాళికను గురించి తన సృష్టితాలలో ఎవరికేది అవసరమో తగు మోతాదులో నిర్థారించాడు. ప్రతి వస్తువు విధి వ్రాతను ముందే చేశాడు. ప్రవక్త ఈసా (అ) ఇలా హితవు పలికారు: ”అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి తిందుమో యేమి త్రాగుదుమో అని మీ ప్రాణము గూర్చి యైనను,ఏమి ధరించుకొనుమో అని మీ దేహ మును గూర్చియైనను చింతింపకుడి; ఆహార ముకంటే వస్త్రముకంటే దేహమును గొప్పవి కాదా?!

ఇస్లాం వలన ఉపయోగమేమి?

ఇస్లాం వలన ఉపయోగమేమి?

2024-04-26T00:21:01

”మీ ప్రభువు క్షమాభిక్ష వైపునకు పరుగెత్తండి ఒకరికంటే ఒకరు ముందుకు పోయే కృషి చేయండి; ఆకాశాలంత, భూమియంత విశాల మైన స్వర్గం వైపునకు పరుగెత్తండి. అది అల్లాహ్‌నూ ఆయన ప్రవక్తలనూ విశ్వసించిన వారి కొరకు సిద్ధం చేయబడింది.ఇది అల్లాహ్‌ అనుగ్రహం; తాను కోరిన వారి కొరకు దాని ని ప్రసాదిస్తాడు. అల్లాహ్‌ా ఎంతో అనుగ్రహం కలవాడు.” (ఖుర్‌ఆన్‌ 57:21)

పెళ్ళి కొరకు  నిషేధించబడిన స్త్రీలు

పెళ్ళి కొరకు నిషేధించబడిన స్త్రీలు

2024-04-24T23:51:47

వైద్యశాస్త్రం కూడా మేనరికం చెయ్యరాదని (అంటే అక్క కుమార్తెను వివాహం) చేసుకో వటం వలన అనేక సమస్యలు వస్తాయని చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఖుర్‌ఆన్‌ లో 1400 సంవత్సరాలకు పూర్వమే చెప్ప బడింది. ఇప్పుడు శాస్త్రీయపరంగా పరిశీలి ద్దాం. క్రీ.శ. 1665 సంవత్సరంలో రాబర్ట్‌ హుక్‌ అను శాస్త్రజ్ఞుడు జీవరాశుల శరీరము అనేక గ్రంధులు వంటి కణములతో నిర్మింప బడి ఉంటాయని కనుకొన్నాడు.

పుస్తకం మస్తకం

పుస్తకం మస్తకం

2024-04-23T23:26:07

పుస్తకం అన్నది రెండు అట్టల మధ్య కుట్టిన కొన్ని కాగితాల బొత్తిగా భౌతికంగా మనకు కనబడవచ్చు. కానీ, నిజంగా పుస్తకం ఆంటే మనిషి మస్తకం. మనిషి పొందగలిగిన సకల అనుభవాలు,ఎదుర్కో గలిగే సకల సమస్యలు, ఎదురు నిలిచే సకల చిక్కుముడులు, మనిషిని ఊపేయగలిగే సకల ఉద్వేగాలు-అన్నీ పుస్తకం లో నిక్షిప్తమయి ఉంటాయి. యావత్తు నాగరిక ప్రపంచం ఒక ఎత్తు; పుస్తకం మరో ఎత్తు. ఆధునిక ప్రపంచం మొత్తాన్ని పుస్తకాల ద్వారా పునర్నిర్మించవచ్చు!

మరింత ప్రేమనివ్వండి మరింత సమయమివ్వండి

మరింత ప్రేమనివ్వండి మరింత సమయమివ్వండి

2024-04-22T23:11:15

మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మనం చేపట్టే ఏ పనికయినా అవి రళ కృషి, అవిశాంత పరిశమ్ర, గట్టి పట్టుదల అవసరం. మన ఇంట ఒక మొగ్గ విర బూసిం దంటే, మనం తల్లిదండుల్రుగా అప్పుడే జన్మించామని అర్థం. మన తోటలో మనం వేసిన ఆ విత్తనం మొలకయి, మహా వృక్షాన్ని సృజించగలగాలంటే, ఆ మహా వృక్షంలోని ఒక్కొక్క కొమ్మ, ఒక్కొక్క రెమ్మ, ఒక్కొక్క ఆకు, ఒక్కొక్క పువ్వు, ఒక్కొక్క ఫలం నుండి మానవత్వపు అమృతం జాలువారాలంటే – మనం నిరంతరం మారుతూ, నేర్చుకుంటూ ఉండాలి. చేయదగిన పనులేవో, చేయకూడని పనులేవో, ఉచిత నిర్ణయాలేవో, అనుచిత నిర్ణయాలేవో వారికి అర్థమయ్యేలా బోధించాలి.

రాజో ఋతువు రమజాన్‌

రాజో ఋతువు రమజాన్‌

2024-04-21T22:53:46

ఇంతటి పుణ్యప్రదమైన మాసం ఒంటరిగా రాదు. అచ్చమైన దైవానుగ్రహాల్ని, స్వచ్ఛమైన దివ్యగ్రంథ పారాయణాల్ని, వేయి నెలలకన్నా ఘనతరంగా నిలిచే పండు వెన్నెల్ని వెంట బెట్టుకొస్తుంది. సుభక్తాగ్రేసరుల భక్తీప్రత్తులకు, విశ్వంలోని విశ్వాసుల సంస్కృతీ సంప్రదాయాలకు, వారి మధ్య గల సఖ్య తకు, ఐక్యతకు ఆలంబనగా నిలుస్తుంది రమజాన్‌.

ఓ మానవుడా!

ఓ మానవుడా!

2024-04-20T22:29:53

పరమ దాత ఆయిన నీ ప్రభువును గురించి ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? ఆయనే ఒక రేతస్సు బిందువుతో నిన్ను సృష్టించాడు. ఎలాంటి లోపం లేకుండా నిన్ను తీర్చిదిద్దాడు. తాను తలచిన ఆకారంలో నిన్ను క్రమబద్ధంగా మలచాడు. ఆయనే నీకు చూడటానికి రెండు కళ్ళూ ప్రసాదించాడు. మాట్లాడటానికి ఒక నాలుకా, రెండు పెదవులూ అనుగ్రహించాడు. ఆయనే నిన్ను వినేవాడుగా చేశాడు. ఆయనే నీలో ఆలోచించే, అర్థం చేసుకునే మనస్సు కూడా ఇచ్చాడు. కాని నీవు ఆయన మేళ్ళను మరచి కృతఘ్నుడుగా మారావు.

మంచికి మారు పేరు ఇస్లాం

మంచికి మారు పేరు ఇస్లాం

2024-04-19T22:24:21

నీ ప్రభువు నిర్ణయం చేసేశాడు, మీరు కేవలం అయన్ని తప్ప మరెవ్వరినీ ఆరాధించకండి, తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి, ఒకవేళ మీవద్ద వారిలో ఒకరుగానీ, ఇద్దరుగానీ ముసలివారై ఉంటే వారి ముందు విసుగ్గా ‘ఉఫ్‌’ (ఛీ) అని కూడా అనకండి. మృదుత్వమూ, దయాభావమూ కలిగి వారి ముందు వినమ్రులై ఉండండి. ఇలా ప్రార్ధిస్తూ ఉండండి; ప్రభూ! వారిపై కరుణ జూపు- బాల్యంలో వారు నన్ను కారుణ్యంతో వాత్సల్యంతో పోషించినట్లు”. (ఖుర్‌ఆన్-17: 23,24)

నైతిక విలువల్ని నిలుపండి…!

నైతిక విలువల్ని నిలుపండి…!

2024-04-18T22:11:23

రాకెట్టు వేగంతో దూసుకుపోతున్న ప్రగతి, త్వర త్వరగా మారుతున్న పరిస్థితులలో మానవ సమాజం రకరకాల సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది. ఒనరులు పెరుగుతున్నా, ఓనమాలు నేర్చుకునేవారు అధికమవుతున్నా సామాజిక రుగ్మతలు, సంఘంలోని అసాంఘీక కార్యకలాపాలు మాత్రం తగ్గడం లేదు. ప్రతి ఇంటిలోనూ ఈనాడు పెద్దలకు, పిల్లలకూ మధ్య అవగాహనా లోపం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. నైతిక విలువలలో మనం ఇముడ్చుకోలేనన్ని మార్పులు పొడ సూపు తున్నాయి. వెనుకటి తరాల వారికి ఎదురవని అనేక సమస్యలు ఈనాడు మనకు ఎదురవుతున్నాయి. పరస్పరం నిందా రోపణలు, కక్షలు, కార్పణ్యాలు పెచ్చు పెరిగి పోతున్నాయి.

గుండెలోని ప్రాణం గొంతు దాటక ముందే….

గుండెలోని ప్రాణం గొంతు దాటక ముందే….

2024-04-17T21:49:10

మడతలు పడిన ఆశలు, కలలు, వాంఛలు ముసలివాని ముఖ కవళికలు మాదిరిగా మారుతాయి. మనం మళ్ళీ చూసేటప్పటికి, అందు మన ముఖమే కనబడుతుంది. శీతాకాలంలో చెట్ల ఆకుల్లాగా 60, 80 సంవత్సరాలు మన జీవన వృక్షం నుంచి రాలి పోతాయి. అయితే భక్తిపరులకు జీవితం మృత్యువూ రెండూ సమానమే! కాదు, కాదు. వారికి జీవితం కన్నా మృత్యువే మనోహరం!! జీవితం పరీక్ష అయితే మృత్యువు పరమోన్నత మిత్రునికి చేరువ చేసే మహత్తర సాధనం. వారు మృత్యువును ప్రేమించినంతగా మరి దేన్నీ ప్రేమించరు. జీవితం మనిషిలోని కోర్కెలకు ఆజ్యం పోసినప్పుడు అది ఆశల ఆత్రాన్ని పెంచే, వెర్రితనాన్ని రెచ్చగొట్టే, దైవ అవిధేయతకు ఉసిగొల్పే చేష్టలే ఎక్కువగా చేస్తుంది.

రహస్య సమాలోచన

రహస్య సమాలోచన

2024-04-16T21:32:35

ఓ విశ్వాసులారా! మీరు గనక (పరస్పరం) రహస్య సమాలోచన జరిపితే పాపం, అత్యాచారం, ప్రవక్త పట్ల అవిధేయత గురించిన సమాలోచన జరపకండి. దానికి బదులు సత్కార్యం, భయభక్తులకు సంబంధించిన సమాలోచన జరపండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి.

ప్రయాణపు (ఖస్ర్‌) నమాజు)

ప్రయాణపు (ఖస్ర్‌) నమాజు)

2024-04-15T21:02:24

ప్రయాణంలో పూర్తి నమాజు చేసుకోవచ్చు కాని ఖస్ర్‌ ఉత్తమం పై హదీసు ద్వారా బోధపడేదేమిటంటే ప్రయాణంలో శక్తి ఉండి పూర్తి నమాజు చేసుకుంటే తప్పు లేదు కాని ఖస్ర్‌ చేయటమే ఉత్తమం. అయినా దేవుడు చేస్తున్న ఉపకారాన్ని స్వీకరించని దౌర్భాగ్యుడు ఎవడుంటాడు చెప్పండి! అందుకే దైవప్రవక్త (స), ఆయన అనుచరులు అత్యధికంగా ఖస్ర్‌ విధానాన్నే ఆచరించేవారు.

మరణం తప్పదు మనిషికి

మరణం తప్పదు మనిషికి

2024-04-14T19:27:09

‘భూమండలంపై ఉన్నవారంతా నశించిపోవలసినవారే. ఎప్పటికీ మిగిలి ఉండేది ఘనత, గౌరవం గల నీ ప్రభువు అస్తిత్వం మాత్రమే”. (అర్రహ్మాన్: 26,27) దైవ ప్రవక్త (స), హజ్రత్‌ అబ్దుల్లాహ్‌ా బిన్‌ ఉమర్‌ (ర)ను ఉద్దేశించి ఇలా అన్నారు: ”ఇహలోకంలో నీవు ఒక బాటసారిలా జీవించు. లేదా దారిన నడిచివెళ్ళే సామాన్యుడిలా ఉండు. సాయంత్రం అయితే ఉదయానికై ఎదురు చూడకు. ఆరోగ్యాన్ని అనారోగ్యం కన్నా మేలైనదిగా తలంచు. మరణం కన్నా జీవితం గొప్పదని భావించు”. (బుఖారీ)

మూర్తీభవించిన సత్యం మహా ప్రవక్త ముహమ్మద్‌ (స)

మూర్తీభవించిన సత్యం మహా ప్రవక్త ముహమ్మద్‌ (స)

2024-04-13T18:47:32

అంతకు పూర్వం ఏ శతాబ్దిలోనూ సుదీర్ఘ ప్రపంచ చరిత్ర ఇన్ని మార్పులు చూడలేదు. లోకం మొత్తం కాంతి కానక, కటిక చీకట్లలో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) జన్మించారు. నిఖిల జగతిలో విశ్వకర్త శాసనాన్ని అక్షరాలా పాటించే ఆదర్శ సమాజాన్ని నెలకొల్పి తనువు చాలించారు ఆయన. ఆయన హితోక్తుల శుభ జల్లుల వెల్లువలో మిథ్యాశక్తులన్నీ కొట్టుకుపోయాయి. సర్వత్రా ఏకేశ్వరోపాసనా నినాదాలు మారుమ్రోగాయి. దాస్య శృంఖలాలు మోయలేక ఒంగిపోయిన మానవ శిరస్సులు ధైర్యంతో శిఖరాలయి నిలిచాయి. బానిస సంకెళ్ళకు మూగబోయిన గొంతులు ఒక్కసారిగా స్వేచ్ఛా గీతాన్ని ఆలాపించాయి.

పగవారి పన్నాగాలు

పగవారి పన్నాగాలు

2024-04-12T18:30:23

మహా ప్రవక్త (స) వారి దృష్టి నిశితం – సునిశితం. ఆయన దృష్టి విశ్వాంతరాళంలోకి దూసుకుపోయింది. సృష్టి పరమ రహస్యాలను, సృష్టికర్త శక్తియుక్తులను లోతుగా – విశాలంగా, నిదానంగా – నెమ్మదిగా – నమ్రతతో పరిశీలించా రాయన. సృష్టి గురించి ఆయనకు తెలిసిన విషయాలు అగణ్యం. సృష్టికర్త ఆయనకు తెలిపిన రహస్యాలు అనన్యం. కనుకనే ఆయన వాక్కు సత్యం. సత్య సౌందర్యం ఆయన మాటల్లో, భావాల్లో, ఆచరణల్లో ప్రస్ఫుటంగా వ్యక్తమయ్యేది. సూక్ష్మం-సున్నితం-సత్యం అయిన దివ్య వాణిని ఆయన తన మధురమైన స్వరంతో కోటి రాగాలు పలికించారు. ఆయన నోట వెలువడే ప్రతి మాట శక్తివంతం-సుకుమారం -మార్దవం. అది రమ్యమైనది- మనోహరమైనది- సంతోష కరమైనది-సహజమైనది- అద్భుతమైనది – అద్వితీయమైనది – అమోఘమైనదీను. అది ఒక్కోసారి భయాన్ని కలిగిస్తుంది. దడ పుట్టిస్తుంది. పాపం, నేరం, నరకం విషయంలో అది అలాగే ఉంటుంది.

అడుగు -ముందడుగు

అడుగు -ముందడుగు

2024-04-11T18:04:00

అడుగు అనే సరికి అనేక అర్థాలు స్పృశిస్తాయి. అడిగినకొద్దీ అర్థాలు పుట్టుకొస్తాయి. అందుకే ‘అడుగు తెలియని ప్రతీదాన్ని’ అంటు న్నాడు ఆ పరమ ప్రభువు. తనకు ప్రాప్తమయి ఉన్న అసాధారణ తెలివి తేటలతో, అనుపమ ప్రతిభతో, అవిరళ కృషితో, అనూహ్య ఫలితాలతో అధ్బుతాల్ని, మహాత్భుతాల్ని ఆవిష్కరించి తన తర్వాతి తరంకోసం అడుగుజాడల ముద్రని వదిలి దృశ్యంగా కను మరుగై ఆదర్శంగా సుజనులై, సుగతులై సజీవంగా సమాజంలో అగ్రజులంటూ నీరాజనాలందుకొనేవారు కొందరుంటుంటే, మరి కొంద రేమో ఆదర్శశూన్యులుగా చెలామణి అవుతూ, అలగాజనాల అడుగులకు మడుగులొత్తుతూ ‘అడుగు గులాములు’గా బ్రతుకుతూ, అడుగు లేని పాత్రలా తడబడు అడుగులతో తంటాలు పడుతూ, మోక్షసాధన అడుగు దూరంలో ఉన్నా అడుగెత్తలేక, ఎత్తినా ముందడుగు వేయలేక అడుగు తప్పి, అట్టడుగున పడి అష్ట అప్రతిష్టలకు గురై గుణపరంగా అడుగు పుట్టులుగా, అస్పృశ్యులుగా, అడుగంటిన సిద్దాంతాలతో, తేలిపోయిన తత్వాలతో తొక్క మనుషులుగా తస్కారం పొందుతున్నారు.

ఖుర్‌ఆన్‌ సామాజిక న్యాయం

ఖుర్‌ఆన్‌ సామాజిక న్యాయం

2024-04-10T17:08:24

అనాదిగా మానవాళి ఆక్రందన సామాజిక న్యాయం కోసమే. ప్రాచ్య, ప్రాశ్చాత్య పౌరుల్లో ఎవరూ దీనికి అతీతులు కారు. భూస్వామ్య వ్యవస్థ (ఫ్యూడలిజమ్‌), పెట్టుబడి దారి వ్యవస్థ (క్యాపిటలిజమ్), సామ్యవాదం (సోషలిజం), జాతీయ అతి వాదాలు(ప్యాషిజమ్) మానవాళి కి సామాజిక న్యాయాన్ని ఇవ్వడానికి బదులు వారి బతుకును మరింత దుర్భరం చేశాయి. బానిస వ్యవస్థ, ఉక్కుపాదాల కింద నలిగిన మానవాళికి సామాజిక సమానత్వాన్ని, ఆర్థిక న్యాయాన్ని అనంతకాలం వరకు అందించే ప్రాథమిక బోధనలు దైవం ఖుర్‌ఆన్‌లో అవతరింపజేశాడు.ఈ బోధనలను విస్మరిం చిన మానవాళి నష్టానికి గురవుతున్నది.

మిణుగురు పురుగు ఎందుకు మెరుస్తుంది?

మిణుగురు పురుగు ఎందుకు మెరుస్తుంది?

2024-04-09T16:25:21

”ఇదీ అల్లాహ్‌ సృష్టి! ఇప్పుడు ఆయన తప్ప వేరితరులు ఏం సృష్టించారో మీరు నాకు చూపిం చండి? (ఏమీ సృష్టించ లేదు) నిజానికి దుర్మార్గులు స్పష్టమైన మార్గభ్రష్టత్వానికి లోనై ఉన్నారు”. (లుఖ్మాన్: 11) పై ఆయతులో ‘ఇదీ’ అన్న పదం అల్లాహ్‌ రకరకాల సృష్టితాలను సూచిస్తోమది. ఎలాంటి స్థం భాలు లేకుండా ఆకాశాన్ని నిలబెట్టడం, భూమి మానవులతోపాటు ఒరిగి పోగుండా ఉండటానికి భూమిలో పర్వతాలను నాటడం, సర్వ రకాల ప్రాణులను భూమిలో నివసింప జేయడం, ఆకాశా న్నుండి వర్షాన్ని కురిపించి భూమిలో అన్ని రకాల మేలు జాతి పంటలను (మొలకలు) ఉత్పన్నం చేయడం అయన ఒక్కడికే చెల్లు. కాబట్టి మనషి సృష్టికర్తను వదలి పూజించే చిల్లర దేముళ్లు, సహాయం కోసం అర్థించే మిథ్యాదైవాలు భూమ్యాకాశాల ఈ వ్యవస్థలో చేసింది ఏమీ లేదు.

వై దిస్వివక్ష?

వై దిస్వివక్ష?

2024-04-08T15:52:09

ఆరోగ్యమయిన దేహాన్ని వదలి పుండు మీద వాలి ఈగ గాయాన్ని కెలికి నట్టు మత, రాజకీయ, ఛాందసవాదులు కొందరు అన్య మతాల పట్ల ప్రజల్లో గల అవగహానా లేమిని ఆసరాగా చేసుకొని జనస్రవంతిలో అశ్రాంతి, అలజడులు సృష్టిస్తున్నారు. ‘మంచి చెడ్డలు – రెండే మత ములు’ అని తెలియని మేధా(తా)వులు కొందరు ఇస్లాం ధర్మ అద్వితీయ సౌందర్యాన్ని వదలి ఎక్కడో ఎవరో పాల్పడే దుష్చర్యల్ని ఇస్లాం ధర్మంతో ముడి పెట్టేందుకు విఫల ప్రయత్నం చేస్తున్నారు.

జకాత్‌ వ్యవస్థ

జకాత్‌ వ్యవస్థ

2024-04-07T15:00:25

ఇస్లాం సౌధానికి ఉండే అయిదు మూల స్తంభాల్లో విశ్వాస ప్రకటనం, నమాజు తర్వాత ‘జకాత్‌’ మూడవ మూలస్తంభంగా ఆరాధనా విధుల్లో రెండవ మూలస్తంభంగా పరిగణంచబడింది. ఖుర్‌ఆన్‌లో కనీసం 32 చోట్ల నమాజుతోపాటు జకాతు ప్రస్తావన వచ్చింది. దీన్ని బట్టి జకాతుకు ఎంత ప్రాముఖ్యం ఉందో తెలుస్తుంది. ఖుర్‌ఆన్‌ అనేక చోట్ల నమాజ్‌, జకాత్‌లను గురించే ఎక్కువ ప్రస్తావించడం గమనిస్తే, మొత్తం దైవారా ధనల్లో వీటి విశిష్ఠత ఏపాటిదో గ్రహించగలం. ఖుర్‌ఆన్‌లోని సూక్తులు చదవండి: ”(సత్యాన్ని) విశ్వసించి సదాచార సంపన్నులయి నమాజును నిర్వహిస్తూ, జకాతును చెల్లి స్తూ ఉండేవారికి వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద సిద్ధంగా ఉంది. వారికి ఎలాంటి భయంగాని, దుఃఖంగాని ఉండదు”. (అల్‌ బఖరా: 277)